Roja: నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ సీఎస్ కు రోజా వినతి

Roja met CS Sameer Sharma and wants to merge Nagari constituency into Balaji District
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
  • నగరి అంశాన్ని సీఎస్ కు నివేదించిన రోజా
  • తిరుపతితో నగరి ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని వ్యాఖ్య  
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎస్ సమీర్ శర్మను కలిశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లాలో కలపాలని రోజా సీఎస్ ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతితో నగరి నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని ఆమె వివరించారు. తిరుపతి నగరానికి 9 కిలోమీటర్ల దూరంలోనే నగరి నియోజకవర్గం ప్రారంభమవుతుందని, నగరి నియోజకవర్గం అంతా తిరుపతికి వెళ్లే నేషనల్ హైవేకి ఆనుకునే ఉంటుందని వివరించారు.

ముఖ్యంగా, నగరి నియోజకవర్గంలోని ఆస్తి పన్ను చెల్లింపులు తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పేరిటే జరిగాయని రోజా తెలిపారు. ఈ సందర్భంగా, నగరిని బాలాజీ జిల్లాలో చేర్చాలంటూ నియోజకవర్గంలోని మండలాలు, పురపాలక సంఘాల కార్యవర్గాలు చేసిన తీర్మానాల ప్రతులను కూడా రోజా సీఎస్ సమీర్ శర్మకు అందజేశారు.
Roja
CS
Sameer Sharma
Nagari
Balaji District
YSRCP
Andhra Pradesh

More Telugu News