Bangarraju: సోగ్గాడు మళ్లీ వచ్చాడు.. జీ5లో ‘బంగార్రాజు’ సందడి షురూ

Nagarjuna naga Chaitanya movie Bangarraju movie streaming on zee5 from today
  • సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’
  • కరోనా కాలంలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ
  • నేటి నుంచి జీ5లో స్ట్రీమింగ్
టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున, తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు. సంక్రాంతి పండుగనాడు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి అక్కినేని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న ‘బంగార్రాజు’ ఇప్పుడు ఓటీటీ ద్వారా ఇంటింటికీ వచ్చేస్తున్నాడు. జీ5లో నేడు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లలో చూసిన అభిమానులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించేందుకు మరోమారు సిద్ధమవుతున్నారు.

సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది.  కరోనా థర్ట్ వేవ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫలితంగా కరోనా కాలంలో విడుదలై విజయవంతమైన సినిమాగా రికార్డులకెక్కింది.
Bangarraju
Naragarjuna
Naga Chaitanya
Tollywood
Zee5

More Telugu News