Yanamala: ఏపీలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభం: యనమల
- రెవెన్యూ లోటు రూ.52,291 అధికంగా పెరిగింది
- రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ
- ఏపీని ఆర్థిక దివాళా చేసే పరిస్థితికి తీసుకొచ్చారన్న యనమల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెవెన్యూ లోటు రూ.52,291 అధికంగా పెరిగిందని ఆయన అన్నారు. అలాగే, ద్రవ్య లోటు రూ.43,386 కోట్లు అధికంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభం నెలకొందని తెలిపారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితులపై వైసీపీ నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సహజ వనరులను దోపిడీ చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీని ఆర్థిక దివాళా చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీలో ఏపీ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయిందని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.4,83,791 కోట్ల అప్పులు తెచ్చారని ఆయన మండిపడ్డారు.