Heli Song: యూట్యూబ్ లో దూసుకుపోతున్న సెబాస్టియన్ చిత్రంలోని 'హేలి' సాంగ్

Heli song from Sebastian reaches million views
  • కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్ పీసీ 524'
  • బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో చిత్రం
  • నిన్న హేలి సాంగ్ రిలీజ్
  • కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ 
యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం సెబాస్టియన్ పీసీ 524. ఈ చిత్రం నుంచి హేలి అనే సాంగ్ నిన్న రిలీజైంది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట మిలియన్ వ్యూస్ దాటింది. 'నీ మాట వింటే రాదా మైమరపే..' అంటూ సాగే ఈ గీతాన్ని కపిల్ కపిలన్ ఆలపించారు. భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడు.

ఇందులో కిరణ్ అబ్బవరం సరసన నువేక్ష, కోమలీ ప్రసాద్ నటించారు. సెబాస్టియన్ పీసీ 524 చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. జోవితా సినిమాస్ బ్యానర్ పై సిద్ధారెడ్డి, బి.రాజు, ప్రమోద్ నిర్మించారు.
Heli Song
Sebastian PC 524
Kiran Abbavaram
Tollywood

More Telugu News