Vijay: తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు... ప్రజలకు క్షమాపణలు చెప్పిన హీరో విజయ్

Tamil hero Vijay apologizes voters at Neelangarai poling booth in Chennai
  • ఓటు హక్కు వినిగియోగించుకున్న కోలీవుడ్ ప్రముఖులు
  • నీలాంగరై పోలింగ్ బూత్ కు వచ్చిన విజయ్
  • ఫొటోలు తీసేందుకు పోటీలు పడిన మీడియా 
  • ప్రజలకు అసౌకర్యం
తమిళనాడులో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కోలీవుడ్ ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇలై దళపతి విజయ్ ఓటు వేసేందుకు చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు.

అయితే, హీరో విజయ్ రాక నేపథ్యంలో ఆయనను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు పోటెత్తారు. ఆ పోలింగ్ బూత్ అంతా మీడియా ప్రతినిధులతో నిండిపోయింది. అదే సమయంలో అక్కడ ఓటేసేందుకు వచ్చిన ప్రజలు ఈ పరిణామంతో అసౌకర్యానికి గురయ్యారు. ప్రజల పరిస్థితిని గమనించిన హీరో విజయ్ వెంటనే వారికి క్షమాపణలు తెలియజేశారు. తన కారణంగా ఇబ్బందులు ఎదురవడం పట్ల చింతిస్తున్నట్టు వెల్లడించారు.
Vijay
Vote
Urban Body Elections
Chennai
Kollywood
Tamilnadu

More Telugu News