Raghu Rama Krishna Raju: ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

MP Raghurama Krishna Raju wrote AP DGP Rajendranath Reddy

  • గౌతమ్ సవాంగ్ స్థానంలో డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
  • తనపై సీఐడీ అధికారులు దాడి చేశారన్న రఘురామ
  • వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నాడని వెల్లడి
  • దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసకుల గురిచేశారని రఘురామ డీజీపీకి వెల్లడించారు. తనపై దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారని తెలిపారు.

ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదని రఘురామ ఆరోపించారు. లోక్ సభ స్పీకర్ కోరిన మేరకు నివేదికను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత రీతిలో దర్యాప్తు జరపాలని కోరారు.

  • Loading...

More Telugu News