Andhra Pradesh: సవరించిన వేతనాలు, హెచ్ఆర్ లో మార్పులపై కొత్త జీవో జారీ చేసిన ఏపీ సర్కారు

AP Govt issues new orders on revised salaries

  • ఇటీవల మంత్రుల కమిటీతో ఉద్యోగుల చర్చలు
  • కుదిరిన ఒప్పందం
  • హెచ్ఆర్ఏ 24 శాతం పెంపు
  • కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు

ఉద్యోగుల వేతనాలు, ఇతర అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు కొత్త పీఆర్సీ జీవోలు జారీ చేసింది. 11వ పీఆర్సీలో హెచ్ఆర్ఏ 16 శాతం ఉండగా, మంత్రుల కమిటీ అంగీకరించిన మేరకు దాన్ని తాజా ఉత్తర్వుల్లో 24 శాతానికి పెంచారు. హెచ్ఆర్ఏ గరిష్ఠ పరిమితిని రూ.25 వేలుగా పేర్కొన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులు, ఏపీ భవన్, హైదరాబాదులో పనిచేసే ఏపీ ఉద్యోగులకు ఈ 24 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని తెలిపారు.

జీవోల్లోని ఇతర అంశాలు...

  • 50 వేలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం హెచ్ఆర్ఏ లేదా రూ.11 వేలు మించకుండా సీలింగ్.
  • 2 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ, రూ.13 వేలు మించకుండా సీలింగ్.
  • 2 లక్షల నుంచి 15 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 16 శాతం హెచ్ఆర్ఏ. లేదా, రూ.17 వేల సీలింగ్ విధింపు.
  • 2024 జూన్ 1వ తేదీ వరకు హెచ్ఆర్ఏ పెంపు వర్తింపు.

ఇక పెన్షనర్లకు సంబంధించి అదనపు క్వాంటమ్ ఆఫ్ పే నిర్ధారించారు. ఈ మేరకు జీవో జారీ చేశారు. దీని ప్రకారం....

  • 100 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 50 శాతం పింఛను.
  • 95 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం పింఛను.
  • 90 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 30 శాతం పింఛను.
  • 85 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 25 శాతం పింఛను.
  • 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 20 శాతం పింఛను.
  • 75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 12 శాతం పింఛను.
  • 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పింఛను.



  • Loading...

More Telugu News