Deepak Chahar: దీపక్ చాహర్ కు తొడ కండర గాయం.. శ్రీలంకతో సిరీస్ కు సందేహమే

Pacer Deepak Chahar suffers hamstring injury doubtful for T20I series against Sri Lanka

  • ఆదివారం మ్యాచ్ లో గాయం
  • రెండు ఓవర్ల బౌలింగ్ కే పరిమితం
  • పూర్తిగా పరీక్షించాకే గాయంపై స్పష్టత
  • గ్రేడ్-1 అయితే కోలుకోవడానికి ఆరు వారాలు

శ్రీలంకతో టీ20 సిరీస్ కు బౌలర్ దీపక్ చాహర్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చాహర్ కుడి తొడ కండరానికి గాయం అయింది. రెండు ఓవర్ల బౌలింగ్ తో ఆరంభంలోనే రెండు వికెట్లు తీసిన చాహర్ మరిన్ని ఆశలు రేకెత్తించాడు. కానీ, రెండో ఓవర్ చివర్లో కుంటుతూ దర్శనమిచ్చాడు. ఇక ఆ తర్వాత బౌలింగ్ కు దూరంగా ఉండిపోయాడు.

దీంతో గురువారం నుంచి శ్రీలంకతో మొదలయ్యే మూడో టీ20 మ్యాచ్ సిరీస్ కు చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. తొడ కండర గాయం ఏ స్థాయిలో ఉందన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ పెద్ద గాయమే అయితే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేదీ సందేహంగా మారొచ్చు. దీపక్ చాహర్ ను రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.

మొదటి గ్రేడ్ గాయం అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుందని అంచనా. ఐపీఎల్ సీజన్ 2022 మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. చాహర్ కోలుకుంటే సీజన్ మధ్యలో అయినా వచ్చి చేరే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News