Revanth Reddy: జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: రేవంత్ రెడ్డి

Jagga Reddy is my friend says Revanth Reddy
  • జగ్గారెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు
  • మానసికంగా అందరూ బలంగా ఉండాలి
  • అధికారంలోకి వచ్చేందుకు అందరం కలిసి పని చేయాలి
జగ్గారెడ్డి తమ పార్టీ నాయకుడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో కూడా తమ సీనియర్ నేత వి.హనుమంతరావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని... ఎవరు చేస్తున్నారని ఆరా తీస్తే చివరకు ఆ వ్యక్తి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని చెప్పారు.

జగ్గారెడ్డిది తమ పార్టీ కుటుంబ సమస్య అని... అందరం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. మానసికంగా బలంగా ఉండాలని, కృంగిపోతే శత్రువులు విజృంభిస్తారని తెలిపారు. తనకు కూడా సోషల్ మీడియాలో చాలా ఎదురయ్యాయని చెప్పారు. జగ్గారెడ్డికి పార్టీ నేతలందరం అండగా ఉంటామని తెలిపారు.
Revanth Reddy
Jagga Reddy
Congress

More Telugu News