Corbevax: 12 నుంచి 18 ఏళ్ల కుర్రకారుకు 'కోర్బెవాక్స్'... దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి
- కోర్బెవాక్స్ ను అభివృద్ధి చేసిన బయోలాజికల్ ఈ
- దేశంలో బాలలకు అందుబాటులోకి రెండో వ్యాక్సిన్
- 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్
- ఇకపై బాలలకు కోర్బెవాక్స్ కూడా ఇవ్వనున్న కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సిన్ ను అన్ని వయసుల వారికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బాలలకు, కుర్రకారుకు అందించేందుకు మరో వ్యాక్సిన్ కు పచ్చజెండా ఊపింది. హైదరాబాదుకు చెందిన ఫార్మా పరిశోధన సంస్థ 'బయోలాజికల్ ఈ' అభివృద్ధి చేసిన 'కోర్బెవాక్స్' కరోనా వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నేడు అనుమతి మంజూరు చేసింది. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల కుర్రకారుకు 'కోర్బెవాక్స్' అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి భారత్ బయోటెక్ తయారుచేసిన 'కొవాగ్జిన్' ను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాలల కోసం దేశంలో 'కోర్బెవాక్స్' రూపంలో రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టయింది.