Andhra Pradesh: ఎండాకాలం వచ్చేసినట్టే.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
- తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత
- అనంతపురం, కర్నూలులో 36.6 డిగ్రీలు
- హైదరాబాదులో 34 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం ప్రారంభమయినట్టే కనిపిస్తోంది. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని తిరుపతిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.1 డిగ్రీలుగా నమోదయింది. కర్నూలు, అనంతపురం పట్టణాల్లో 36.6 డిగ్రీలు... కడపలో 36.2 డిగ్రీలు, తునిలో 36.1 డిగ్రీలు, ఒంగోలులో 35.7 డిగ్రీలు, అమరావతిలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకుంది. పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మార్చి తొలి వారంలోనే ఎండలు మండేలా కనిపిస్తున్నాయి.