CBSE: సీబీఎస్ఈ 10,12 భౌతిక పరీక్షల రద్దు కోరుతూ పిటిషన్.. రేపు సుప్రీంకోర్టు విచారణ 

Supreme Court Agrees To Hear Plea Tomorrow Demanding Cancellation Of CBSE Term 2 Exams In Offline Mode

  • ఇతర మార్గాలను పరిశీలించాలి
  • అత్యవసర విచారణకు పిటిషనర్ల వినతి
  • అంగీకరించిన కోర్టు
  • ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

సీబీఎస్ఈతోపాటు ఇతర బోర్డుల పరిధిలో ఈ ఏడాదికి 10, 12వ తరగతులకు భౌతిక పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై బుధవారం (23న) వాదనలు విననుంది.

భౌతిక పరీక్షలకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని విద్యార్థులు తమ పిటిషన్ లో కోరారు. గతేడాది సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, రాష్ట్రాల బోర్డులు భౌతిక పరీక్షలకు బదులు, అంతర్గతంగా నిర్వహించిన పరీక్షలు, ఇతర అంశాల ఆధారంగా విద్యార్థుల అర్హతను నిర్ణయించడం గమనార్హం.

సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించి టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం. సీఐఎస్సీఈ కూడా ఏప్రిల్ చివరి వారం నుంచే పరీక్షల నిర్వహణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News