China: అబాట్ పిల్లల ఆహార ఉత్పత్తులను వాడొద్దు.. చైనా హెచ్చరిక

China warns consumers not to use certain Abbott formula products

  • ఈ కామర్స్ మార్గాల్లో తెప్పించుకోవద్దు
  • యూఎస్ ఎఫ్ డీఏ సైతం ఇదే సూచన
  • సిమిలాక్ లో నాణ్యత లేమి
  • మిచిగాన్ కేంద్రంలో తయారైన వాటిని వెనక్కి తీసుకుంటున్న కంపెనీ 

అబాట్ లాబరేటరీస్ కంపెనీకి చెందిన బేబీ ఉత్పత్తులను వినియోగించొద్దంటూ చైనా కస్టమ్స్ విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తన వెబ్ సైట్ లో నోటీసును పోస్ట్ చేసింది. సాధారణ వాణిజ్య మార్గాలలో ప్రవేశించని ఉత్పత్తులను కొనుగోలు చేయడం, వినియోగించడం కానీ చేయవద్దని కోరింది.

 ఈ  కామర్స్ పోర్టళ్ల ద్వారా ఇతర దేశాల నుంచి తెప్పించుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక చేసింది. అబాట్ కు చెందిన కొన్ని బేబీ ఫార్ములా ఉత్పత్తులను వినియోగించొద్దంటూ యూఎస్ఎఫ్ డీఏ సైతం ఈ నెల 18న జారీ చేసిన హెచ్చరికను చైనా కస్టమ్స్ విభాగం గుర్తు చేసింది.

మిచిగాన్ కేంద్రంలో తయారైన సిమిలాక్ (తల్లి పాలకు బదులుగా ఇచ్చే పాలపొడి) ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు అబాట్ ఈ నెల 17న ఓ ప్రకటన చేసింది. వీటిలో నాణ్యత లోపించడమే ఈ చర్యకు కారణం.

  • Loading...

More Telugu News