Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ పై విమర్శలు గుప్పించిన గోవా టీఎంసీ చీఫ్
- ఎన్నికల తర్వాత పార్టీ అభ్యర్థులను పీకే వదిలేశారు
- పీకే టీమ్ తో మా అభ్యర్థులందరికీ ఇబ్బందులున్నాయి
- గోవా టీఎంసీ చీఫ్ పదవి నుంచి వైదొలగనన్న కిరణ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఆయన టీమ్ పై గోవా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ అభ్యర్థులను పీకే సంస్థ ఐప్యాక్ వదిలేసిందని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్, ఆయన టీమ్ చేసిన పనికి తాను ఆవేదన చెందుతున్నానని అన్నారు. గోవా టీఎంసీ చీఫ్ పదవి నుంచి తాను వైదొలగడం లేదని చెప్పారు.
ఎన్నికల తర్వాత ఐప్యాక్ తమను వదిలేసిందని టీఎంసీ అభ్యర్థులు భావిస్తున్నారని కిరణ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీఎంసీ అభ్యర్థులందరికీ ఏదో ఒక విధంగా ఐప్యాక్ తో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేశారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. మమతా బెనర్జీ మరోసారి సీఎం అయ్యారు. గోవా ఎన్నికల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో కలిసి టీఎంసీ పోటీ చేసింది.