osmania university: ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. 12 మంది అరెస్ట్
- సీసీఎస్ ఆధ్వర్యంలో సిట్
- ఇప్పటికే 12 మంది అరెస్ట్
- ఎస్ఆర్కే వర్సిటీ సిబ్బందే కీలక సూత్రధారులని అనుమానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల దందా కలకలం రేపుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్.. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసింది.
ప్రత్యేకించి ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాకు ఎస్ఆర్కే యూనివర్సిటీ సిబ్బందే కారణమని కూడా సిట్ గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందుకున్న సిట్.. తదుపరి దర్యాప్తును ఎస్ఆర్కే యూనివర్సిటీకి చెందిన సిబ్బంది కేంద్రంగా సాగించనున్నట్లుగా సమాచారం.