Prabhas: 'స్పిరిట్' కంటే ముందుగా 'రాజా డీలక్స్'ను లైన్లో పెట్టిన ప్రభాస్?

Raja Deluxe movie update
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'రాధే శ్యామ్'
  • షూటింగు దశలో 'ప్రాజెక్టు K'
  • సూపర్ హీరోగా కనిపించనున్న ప్రభాస్
  • త్వరలో సెట్స్ పైకి 'రాజా డీలక్స్'  
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలుగా ఆయన నుంచి 'ఆది పురుష్' .. 'సలార్' పాన్ ఇండియా స్థాయిలో పలకరించనున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K' చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరోగా కనిపించనున్నాడు.

ఆ తరువాత ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందుగా ఆయన మారుతి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మారుతి 'రాజా డీలక్స్' సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మారుతి కూడా ఈ వార్తలను ఖండించలేదు.

ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా ఫాస్టుగా సెట్స్ నిర్మాణం జరుగుతోందని చెబుతున్నారు. చాలా వరకూ ఈ సెట్స్ లోనే షూటింగు జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, పెద్దగా గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలానే ఉంది మరి.
Prabhas
Maruthi
Raja Deluxe Movie

More Telugu News