mallanna sagar: కాళేశ్వ‌రంలో కీల‌క ఘ‌ట్టం.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ జాతికి అంకితం

KCR started mallanna Sagar reservoir

  • మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను జాతికి అంకితం చేసిన కేసీఆర్‌
  • 58 టీఎంసీల నిల్వ సామ‌ర్ధ్యం క‌లిగిన మ‌ల్ల‌న్న సాగ‌ర్‌
  • 15.70 ల‌క్ష‌ల ఎకరాల‌కు జ‌లాశ‌యం నుంచి సాగు నీరు
  • కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద జ‌లాశ‌యంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్‌

తెలంగాణ‌లోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ప‌రిగ‌ణిస్తున్న కాళేశ్వ‌రంలో బుధ‌వారం మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద జ‌లాశ‌యం మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను తెలంగాణ స‌ర్కారు జాతికి అంకితం చేసింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా తొగుట మండ‌లం తుక్కాపూర్ వ‌ద్ద నిర్మిత‌మైన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యాన్ని జాతికి అంకితం చేశారు. కేసీఆర్ మీట నొక్క‌గానే.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి గోదావ‌రి జ‌లాలు ప‌‌ర‌వళ్లు తొక్కాయి.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద జ‌లాశ‌యంగా నిర్మిత‌మైన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌లో ఏకంగా 58 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవ‌కాశం ఉంది. ఈ జ‌లాశ‌యం నుంచి ఏకంగా 15.70 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అంద‌నుంది. ఉత్త‌ర తెలంగాణ‌కే కాకుండా ద‌క్షిణ తెలంగాణ‌కు కూడా మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ర ప్ర‌సాదినిగా మార‌నుంది. జ‌లాశ‌యంలో 8 పంపుల‌ను ఏర్పాటు చేయ‌గా.. వీటిలో ఒక్కో పంపు సామ‌ర్థ్యం 43 మెగావాట్లు.

  • Loading...

More Telugu News