bcci: ఒక‌రి వెంట మ‌రొక‌రు.. లంక‌తో సిరీస్ నుంచి సూర్య కుమార్ అవుట్‌

Suryakumar misses T20 series against Sri Lanka due to injury

  • ఇప్ప‌టికే కోహ్లీ, పంత్‌, కేఎల్ రాహుల్‌, అక్ష‌ర్‌లు దూరం
  • తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో దీప‌క్ చాహ‌ర్ కూడా అవుట్‌
  • తాజాగా గాయం కార‌ణంగా సూర్య‌కుమార్ కూడా దూరం
  • లంక‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ‌

శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో టీమిండియాకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. రెస్ట్‌ పేరుతో కోహ్లీ, రిషబ్‌ పంత్‌లు టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రితో పాటు కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌లు కూడా ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యారు. దీపక్‌ చహర్ కూడా తొడ కండరాలు ప‌ట్టేయ‌డంతో లంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా గాయంతో దూరమైనట్లు స‌మాచారం.

సూర్యకుమార్‌ యాదవ్‌ విండీస్‌తో టీ20 సిరీస్‌లో విశేషంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. మూడో టీ20లో 31 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ లంక‌తో సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సూర్య మంగళవారం లక్నోలో ప్రాక్టీస్‌ సెషన్‌లో కనిపించినప్పటికి కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలడంతో లంకతో టీ20 సిరీస్‌కు అతన్ని దూరంగా ఉంచనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా దెబ్బ ఎక్కడ తగిలిందనే విషయంపై స్పష్టత రాలేదు. బహుశా విండీస్‌తో మూడో టి20లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలోనే సూర్యకుమార్‌ చేతికి గాయమై ఉంటుందన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News