Kiran Abbavaram: యంగ్ హీరో మాంఛి స్పీడ్ మీదే ఉన్నాడే!

Nenu Meeku Baga Kavalsinavadini First Look Released
  • వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం
  • రిలీజ్ కి రెడీగా 'సెబాస్టియన్'
  • షూటింగు పూర్తి చేసుకున్న 'నేను మీకు బాగా కావల్సినవాడిని'
  • దర్శకుడిగా కార్తీక్ శంకర్ పరిచయం
యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కాస్త దూకుడుగానే వెళుతున్నాడు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను లైన్లో పెడుతూనే ఉన్నాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన కిరణ్, ఆ తరువాత సినిమా అయిన 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమాతోను సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు.

కిరణ్ మూడో సినిమాగా 'సెబాస్టియన్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మరోపక్క ఆయన చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకి తాజాగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం వదిలారు.

కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. కథానాయికగా సంజన ఆనంద్ పరిచయమవుతుండగా, ఎస్వీ కృష్ణారెడ్డి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
Kiran Abbavaram
Sanjana Anand
Nenu Meeku Baga kavalsinavadini Movie

More Telugu News