rape and murder: మాదాపూర్‌లో దారుణం.. ప్రేయసిపై ప్రియుడి హత్యాచారం
- బాధితురాలిని ప్రేమించిన లాలూ ప్రసాద్
- మరో యువకుడితో తిరుగుతోందని బాధితురాలిపై కక్ష
- హైటెక్ సిటీ వద్దకు పిలిచి ఆమెపై అత్యాచారం, ఆపై హత్య
- పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న లాలూ ప్రసాద్
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెను హత్య చేశాడు. తనను ప్రేమించిన యువతి.. వేరే యువకుడితో సన్నిహితంగా తిరుగుతోందన్న కారణంగా ప్రియుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఘటన వెలుగు చూసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైటెక్ సిటీ ఔట్ పోస్ట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. లాలూ ప్రసాద్ అనే యువకుడు బాధిత యువతిని ప్రేమించాడు. అయితే ఇటీవల సదరు యువతి నరేష్ అనే యువకుడితో తిరుగుతోందట. ఈ విషయాన్ని గమనించిన లాలూ ప్రసాద్.. తనను ప్రేమించి నరేష్‌తో ఎలా తిరుగుతుందని బాధితురాలిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆమెను అంతమొందించాలని పథకం వేసుకున్న లాలూ ప్రసాద్.. యువతిని హైటెక్ సిటీ ఔట్ పోస్టు వద్దకు పిలిచి ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు. ఇదే విషయాన్ని అతడు పోలీసుల వద్ద కూడా ఒప్పుకున్నాడు.