ED: మాల్యా, చోక్సీ, నీరవ్ మోదీ నుంచి రూ. 18 వేల కోట్లు వెనక్కి: కేంద్రం
- మొత్తం రూ. 18 వేల కోట్ల జప్తు
- నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం వచ్చాక 4700 కేసుల విచారణ
- మొత్తంగా రూ. 67 వేల కోట్ల స్వాధీనం
భారత్‌లోని బ్యాంకులను వేల కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లను రాబట్టినట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.