USA: జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి రష్యాదే పూర్తి బాధ్యత: ఐరాస అత్యవసర భేటీలో అమెరికా ప్రకటన
- ఐరాస అత్యవసర భేటీలో రష్యాపై పలు దేశాల ఆగ్రహం
- నిర్ణయాత్మకంగా స్పందిస్తామని బైడెన్ ప్రకటన
- ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని వ్యాఖ్య
- ముందస్తు ప్రణాళిక ప్రకారమే పుతిన్ చర్యలన్న బైడెన్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రష్యాపై ఆయా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యా దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని అమెరికా స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని చెప్పింది. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని పేర్కొంది. తాము తమ మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో నిర్ణయాత్మకంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పుతిన్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రష్యాపై బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు మండిపడ్డాయి.