Ukraine: మన సినిమాల షూటింగ్ స్పాట్ ఉక్రెయిన్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ కొన్ని సన్నివేశాలు

RRR to 99 Songs all Indian films shot in Ukraine
  • స్వాతంత్ర్య సమరయోధుల సన్నివేశాలకు ఉక్రెయిన్ ఎంచుకున్న రాజమౌళి 
  • విన్నర్ సినిమాలోనూ చోటు
  • రజనీకాంత్ 'రోజా కాదల్..' పాట సైతం
రష్యా సైనిక దళాల భీకర దాడులతో వణికిపోతున్న ఉక్రెయిన్ గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, మనం చూసే చాలా సినిమాల్లో అందమైన దృశ్యాలకు చిరునామా ఉక్రెయిన్. అంతెందుకు భారీ అంచనాలతో త్వరలో విడుదల కానున్న రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ లోనూ ఉక్రెయిన్ లో తీసిన సన్నివేశాలు కనిపిస్తాయి. భారత స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కల్పిత పాత్రల చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇందుకోసం గతేడాది ఆగస్ట్ 3న ఆర్ఆర్ఆర్ మూవీ బృందం ఉక్రెయిన్ కు వెళ్లడం గమనార్హం. ఆస్కార్ అవార్డు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా రాసి, తీసిన '99' సాంగ్స్ చిత్రీకరణ కూడా ఉక్రెయిన్ లో జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్ డ్యుయట్ సాంగ్ ‘రోజా కాదల్’ను ఉక్రెయిన్ లోని టన్నెల్ ఆఫ్ లవ్ వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. 2019లో వచ్చిన రొమాంటిక్, యాక్షన్ ఆధారిత దేవ్ అనే తమిళ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్ లో తీశారు. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో నటించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు ప్రధాన తారాగణంతో తీసిన 'విన్నర్' అనే తెలుగు సినిమా చిత్రీకరణ కూడా ఉక్రెయిన్ లో జరిగింది. ఇవి కొన్ని మాత్రమే. భారత్ తోపాటు హాలీవుడ్ సినిమాలకు ఉక్రెయిన్ కేరాఫ్ అడ్రస్ గా ఉంది.
Ukraine
movie
film shootings
rrr
winner

More Telugu News