Ukraine: ఉక్రెయిన్ లోని తెలుగు వారి కోసం ఇద్దరు అధికారులను నియమించిన ఏపీ ప్రభుత్వం
- నోడల్ అధికారిగా రవిశంకర్, ప్రత్యేకాధికారిగా గీతేశ్ శర్మ
- ఇద్దరు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా వెల్లడి
- ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారమే వీరి బాధ్యత
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల కోసం ఆయా దేశాల విదేశాంగ కార్యాలయాలు చర్యలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. ఇక ఆ దేశంలో చిక్కుకున్న ఏపీ పౌరులను సురక్షితంగా రప్పించాలని ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయగా.. తెలంగాణ పౌరుల కోసం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేంద్రానికి లేఖ రాశారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన తెలుగు విద్యార్థులకు సహకారం అందించేందుకు ఏకంగా ఇద్దరు అధికారులను నియమించింది. వీరిలో నోడల్ అధికారిగా నియమించిన రవిశంకర్‌ను 9871999055 నెంబరులోను, ప్రత్యేక అధికారిగా నియమితులైన గీతేశ్ శర్మ (రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి)ని 7531904820 నెంబరులోను సంప్రదించాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.