Amazon Sailfin: శ్రీకాకుళం జిల్లాలో వింత చేప దర్శనం

New fish found in Srikakulam district

  • నారాయణపురం కుడికాలువలో దెయ్యం చేప
  • అమెజాన్ సెయిల్ ఫిన్ చేపగా గుర్తింపు
  • విషపూరితమన్న ఫిషరీస్ ఇన్ స్పెక్టర్
  • చంపేసి పూడ్చి వేయాలని సూచన

శ్రీకాకుళం జిల్లాలో వింత చేప దొరికింది. నారాయణపురం కుడికాలువలో కొందరు రైతులు చేపలు పడుతుండగా, ఎంతో విచిత్రంగా ఉన్న ఈ చేప లభ్యమైంది. ఈ చేపను ప్రమాదకరమైనదిగా భావించిన గ్రామస్థులు దాన్ని చంపి భూమిలో పాతేశారు. నలుపు రంగు శరీరంపై తెల్లటి చారలతో ఉన్న ఈ చేపను తాము గతంలో ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ చేప మొప్పల వద్ద ఉన్న రెక్కలు చాలా బలంగా ఉన్నాయి. అది ఆ రెక్కల సాయంతో పైకిలేచే ప్రయత్నం చేయడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై రాజాం ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ స్పందించారు. ఇది ప్రధానంగా క్యాట్ ఫిష్ జాతికి చెందినదని, దీన్ని అమెజాన్ సెయిల్ ఫిన్, బల్లి చేప అని కూడా అంటారని చెప్పారు.

ఈ చేపకు కింది భాగంలో నోరు ఉంటుందని, ఇది నీరు లేకుండా భూమిపైన కనీసం 15 నుంచి 30 రోజుల వరకు జీవించగలదని వివరించారు. ఈ తరహా చేపలు చెరువుల్లోకి ప్రవేశిస్తే చిన్న చేపలను తినేస్తాయని, ఇవి చెరువు యజమానులకు తీవ్రనష్టం కలిగిస్తాయని అన్నారు. ఇది విషపూరితమైన చేప అని, చంపేసి పూడ్చి వేయాలని సూచించారు. దీన్ని తినడం ప్రమాదకరం అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News