Ukraine: ఈ రాత్రికి పుతిన్‌తో మోదీ మాట్లాడే అవ‌కాశం!

pm narendra Modi has a chance to talk to Putin tonight

  • కీల‌క మంత్రుల‌తో మోదీ అత్య‌వ‌స‌ర భేటీ
  • జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు కూడా హాజ‌రు
  • పుతిన్‌తో మాట్లాడితేనే బాగుంటుంద‌ని భేటీ అభిప్రాయం
  • భేటీ మాట‌కు మోదీ త‌లూపారంటూ వార్త‌లు

ర‌ష్యా-ఉక్రెయిన్‌ల మ‌ధ్య‌ యుద్ధం నేపథ్యంలో శాంతిని కాంక్షించే దేశంగా పేరుగాంచిన భారత్ అడుగుల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న రెండు దేశాల్లో రష్యా మిత్రదేశం కాగా,  ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూసే దేశంగా ఉక్రెయిన్ నిలిచింది.

అటు మిత్ర దేశాన్ని కాద‌న‌లేని ప‌రిస్థితి.. ఇటు సాయం కోసం అర్థిస్తున్న చిన్న‌దేశానికి సాయం చేయ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతానికి త‌ట‌స్థ వైఖ‌రినే అవ‌లంబించ‌నున్న‌ట్లుగా చెప్పిన భార‌త్‌.. ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో కీల‌క భూమిక పోషించ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఈ కీల‌క భూమిక ఏదో ఒక దేశం వైపు నిల‌బ‌డి పోరు స‌లిపేలా కాకుండా ఇరు దేశాల‌తో చ‌ర్చించి యుద్ధాన్ని ఆపేలా చేసే దిశ‌గానే భార‌త్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది,.

ఈ దిశ‌గానే భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఓ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ భేటీకి హోం, ర‌క్ష‌ణ‌, విదేశాంగ‌, ఆర్థిక శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌, జైశంక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌తో పాటు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ కూడా హాజ‌ర‌య్యారు.

ఇక ఈ భేటీలో ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం, తాజా ప‌రిస్థితిపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా భార‌త్‌లో ఉక్రెయిన్ రాయ‌బారి చేసిన విన్న‌పం కూడా ఈ భేటీలో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మిత్రుడైన మోదీ చెబితే పుతిన్ వింటార‌ని, పుతిన్‌తో మోదీ మాట్లాడాల‌ని ఆ రాయ‌బారి కోరిన సంగ‌తి తెలిసిందే.

ఈ అన్ని ప‌రిస్థితుల‌ను బేరీజు వేసిన భేటీ.. పుతిన్‌తో మోదీ ఓ సారి చ‌ర్చించాల‌న్న భావ‌నకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాల్సిందేనంటూ గ‌ట్టిగా చెప్ప‌డం కాకుండా, తాజా ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డంతో పాటుగా సంయ‌మ‌నం పాటించాల‌ని పుతిన్‌కు సామరస్య ధోరణిలో మోదీ చెప్పాల‌న్న మాట భేటీలో వ్య‌క్త‌మైన‌ట్లు స‌మాచారం. ఆ మేర‌కు ఈ రాత్రికే పుతిన్‌కు మోదీ ఫోన్ చేస్తార‌ని తెలుస్తోంది. అమెరికాతో పాటు నాటో దేశాల విజ్ఞ‌ప్తిపై గుర్రుగా ఉన్న పుతిన్.. మోదీ మాట్లాడితే మాత్రం మెత్త‌బ‌డ‌తార‌న్న మాట కూడా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News