Gold: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. రూ. 53 వేలు దాటిన పుత్తడి ధర

Huge Hike in Gold and silver rates amid Russia and Ukraine war

  • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధరపై ఏకంగా 20 డాలర్ల పెరుగుదల
  • బంగారం బాటలోనే వెండి
  • ప్రస్తుతం వివాహాలు లేకపోవడంతో వేచి చూసే ధోరణిలో వినియోగదారులు

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో భీతావహ పరిస్థితులు నెలకొన్న వేళ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. పెట్టుబడులకు సురక్షితంగా భావించే బంగారం, వెండి కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర ఎకాఎకిన 20 డాలర్లుకుపైగా పెరిగి 1924 డాలర్లు దాటింది. వెండిధర కూడా 1.3 శాతం పెరిగి 24.73 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ ట్రేడింగులో గత రాత్రి 11.30 గంటల సమయానికి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.53,100కు చేరుకోగా, వెండి కిలో ధర రూ.68,600గా ఉంది.

బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రూ. 50,700గా ఉండగా, 22 కేరెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47 వేలుగా ఉంది. వెండి కిలో రూ. 65,600గా ఉండగా, ఒక్క రోజులోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పట్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు లేకపోవడంతో వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.

  • Loading...

More Telugu News