TTD: బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
- శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాల రద్దు
- తాజా నిర్ణయంతో సామాన్యులకు పెరగనున్న మరో రెండు గంటల దర్శన సమయం
- శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్లను పెంచాలని నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ఊరటనిచ్చేలా ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత లభించేలా శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో వీఐపీలకు కేటాయించిన సమయాన్ని కూడా సామాన్యులకు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 30 వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.