bheemla naik: టికెట్ రేట్ల దెబ్బ‌కు ఏపీలో థియేట‌ర్ల మూత‌

so may cinema theatres in ap are shutdown

  • జీవో 35 ప్ర‌కార‌మే టికెట్ రేట్లు ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశం
  • ఆ రేట్ల‌తో థియేట‌ర్ల‌ను న‌డ‌ప‌లేమంటున్న యాజ‌మాన్యాలు
  • అదే కార‌ణాన్ని నోటీస్ బోర్డులో పెట్టి థియేట‌ర్ల మూత‌
  • భీమ్లా నాయ‌క్ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డే ఛాన్స్‌

ఓ వైపు జ‌న సేనాని, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్‌కు హిట్ టాక్ రావ‌డంతో ఆయ‌న అభిమానులు కేరింత‌లు కొడుతుంటే.. ఏపీ ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే జారీ చేసిన జీవో 35 ప్ర‌కారం అతి త‌క్కువ ధ‌ర‌కు టికెట్లు విక్ర‌యించి న‌ష్టాలు చూడ‌లేమంటూ ప‌లు ప్రాంతాల్లో థియేట‌ర్ల‌ను వాటి యాజమాన్యాలు మూసివేస్తున్నాయి. ఈ మేర‌కు ఆయా థియేట‌ర్ల వ‌ద్ద త‌మ థియేట‌ర్ల మూసివేతకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేశాయి.

ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నాడు. టిక్కెట్ రేట్లపై కొత్త జీవో రాకపోవడంతో జీవో 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యంగా సి, డి సెంటర్లలో థియేటర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రూ.20, రూ.15, రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో థియేటర్లను మూసివేస్తున్నట్లు బోర్డులు పెడుతున్నారు. పర్యవసానంగా ఏపీలోని చాలా చోట్ల భీమ్లా నాయక్ ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఏపీలో తాజా పరిస్థితులు సినిమా కలెక్షన్‌లపై ప్రభావం చూపే అవకాశముందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News