Nara Lokesh: మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం ప్రతినిధుల అరెస్ట్ ను ఖండిస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh condemned arrest of Ex MLC Rajendra Prasad
  • కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది
  • నిధుల మళ్లింపును నిలదీసినందుకు అరెస్ట్ చేశారు
  • సర్పంచుల పోరాటానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై నారా లోకేశ్ మండిపడ్డారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధుల మళ్లింపుని నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం ప్రతినిధులని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.

తమ హక్కులను హరించి, నిధులను మళ్లించిన వైసీపీ సర్కారుపై సర్పంచుల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. స్థానిక సంస్థల ప్రతినిధుల తరపున పోరాడుతున్న బాబూ రాజేంద్రప్రసాద్ గారిని, సర్పంచుల సంఘం ప్రతినిధులని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ ని అదుపులోకి తీసున్న వీడియోను షేర్ చేశారు.
Nara Lokesh
Rajendra Prasad
Telugudesam
Arrest

More Telugu News