Chiranjeevi: 'జేమ్స్' కోసం రంగంలోకి దిగనున్న చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్

Chiranjeevi and Junior NTR to be guest for Puneeth Rajkumars James film pre release event
  • పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం 'జేమ్స్'
  • ఐదు భాషల్లో విడుదలవుతున్న చిత్రం
  • ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న చిరంజీవి, తారక్
కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' మార్చ్ 17న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చ్ 6న నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించారని, దీనికి వీరిద్దరూ ఓకే చెప్పారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. పునీత్ రాజ్ కుమార్ తో చిరంజీవి, తారక్ కు మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.
Chiranjeevi
Junior NTR
Puneeth Rajkumar
James Movie
Tollywood

More Telugu News