sriti hassan: 'హాయ్ ఎవిరీవ‌న్' అంటూ హీరోయిన్ శ్రుతి హాస‌న్ పోస్ట్.. క‌రోనా సోకింద‌ని వెల్ల‌డి

sriti hsssan tests corona positive
  • అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌చ్చింది
  • ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది
  • తిరిగి ఎప్ప‌టిలాగే నా ప‌నుల్లో పాల్గొనాల‌ని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా
త‌న‌కు క‌రోనా సోకింద‌ని సినీ హీరోయిన్ శ్రుతి హాస‌న్ తెలిపింది. ఈ మేర‌కు ఆమె త‌న అధికారిక ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేసింది. 'హాయ్ ఎవిరీవ‌న్.. నేను ఇస్తోన్న ఈ అప్‌డేట్ స‌ర‌దా కోసం కాదు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. 

ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. తిరిగి ఎప్ప‌టిలాగే నా ప‌నుల్లో పాల్గొనాల‌ని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అంద‌రినీ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుస్తాను థ్యాంక్యూ' అని ఆమె పోస్ట్ చేసింది. కాగా, శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. 

sriti hassan
Tollywood
Corona Virus
COVID19

More Telugu News