Cricket: రోహిత్ కు షేక్ హ్యాండిచ్చేటప్పుడు జర భద్రం: మహ్మద్ కైఫ్
- ఏది పట్టినా బంగారమే అవుతోంది
- ప్రతి చర్యా మాస్టర్ స్ట్రోక్
- అదో గోల్డెన్ టచ్ అంటూ కామెంట్
కెప్టెన్ గా రోహిత్ శర్మ కెరీర్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. వరుస విజయాలతో అతడు కెప్టెన్సీపై తనదైన ముద్ర వేస్తున్నాడు. గత ఏడాది నవంబర్ లో న్యూజిలాండ్ పై, ఈ ఏడాది వెస్టిండీస్ పై టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసేశాడు. ఇవాళ శ్రీలంకతో సిరీస్ ను వైట్ వాష్ చేసి హ్యాట్రిక్ స్వీప్ చేయాలని చూస్తున్నాడు. అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. దీంతో అతడికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్ మ్యాన్ ను ఆకాశానికెత్తేశాడు. ప్రత్యర్థి జట్లు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు.
‘‘రోహిత్ ఏది పట్టినా బంగారమే అవుతోంది. శ్రేయస్ నంబర్ 3, ఆటగాళ్ల రొటేషన్, బౌలింగ్ మార్పులు ఏది చేసినా లాభమే. ప్రతి చర్యా ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతోంది. కాబట్టి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త. అది ఓ గోల్డెన్ టచ్’’ అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు.