Sebastian PC 524: కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ గ్లింప్స్ విడుదల

Sebastian movie trailer glimpse released
  • హ్యాట్రిక్ కు సిద్ధమైన కిరణ్ అబ్బవరం
  • మార్చి 4న సెబాస్టియన్... చిత్రం రిలీజ్
  • ఫిబ్రవరి 28న ట్రైలర్ 
  • రేచీకటి ఉన్న పోలీసుగా నటించిన కిరణ్ అబ్బవరం
యువ హీరో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ పీసీ 524 చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, రేపు (ఫిబ్రవరి 28) ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కానుండగా, నేడు చిత్రబృందం ట్రైలర్ గ్లింప్స్ ను పంచుకుంది. సెబాస్టియన్ అప్ డేట్లకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్ర గీతాలకు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. 

జోవిత సినిమాస్ బ్యానర్ పై సిద్ధారెడ్డి, రాజు, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం రేచీకటి ఉన్న పోలీసు కానిస్టేబుల్ గా కనిపించనున్నారు. కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలు రాజావారు రాణిగారు, ఎస్.ఆర్.కల్యాణమండపం చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడం తెలిసిందే.
Sebastian PC 524
Kiran Abbavaram
Glimpse
Trailer

More Telugu News