CSK: క్రికెటర్ అవ్వాలనుకునే వారి కోసం.. అతి త్వరలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ

CSK to launch Super Kings Academy in Chennai Salem

  • చెన్నై, సేలంలో ఒక్కొకటి చొప్పున ఏర్పాటు
  • ఏప్రిల్ నుంచి శిక్షణ కేంద్రాలు ప్రారంభం
  • బాలురు, బాలికలకు వేర్వేరు శిక్షణా సదుపాయాలు 
  • అనుభవజ్ఞులైన కోచ్ లతో ఏడాది పొడవునా శిక్షణ
  •  క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరణ 

ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు క్రికెటర్లను తయారు చేసేందుకు వీలుగా తమిళనాడులో రెండు చోట్ల ‘చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ’ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. బాలురు, బాలికలకు వేర్వేరు శిక్షణా సదుపాయాలు ఉంటాయి. చెన్నైతోపాటు, సేలంలో అకాడమీ కేంద్రాలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయి.

ఆసక్తి కలిగిన వారు superkingsacademy.com పోర్టల్ పై రిజిస్టర్ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ సూచించింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. అందులోనే వివరాలను పేర్కొంది. మొదట రెండు కేంద్రాల్లో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ కేంద్రాలు ఏర్పాటవుతుండగా.. తమిళనాడు రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలకు, ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. 

చెన్నై సమీపంలోని తరైపాకం వద్ద, సేలంలోని సేలం క్రికెట్ ఫౌండేషన్ వద్ద కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఏడాది పొడవునా అకాడమీ పనిచేస్తుంది. ‘‘ఐదు దశాబ్దాలుగా క్రికెట్ తో అనుసంధానమై ఉన్నాం. క్రీడకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. తదుపరి తరం క్రికెటర్లకు మా అనుభవం పంచుకునేందుకు ఇది మంచి అవకాశం’’అని సీఎస్కే సీఈవో కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. 

అనుభవజ్ఞులైన కోచ్ లతో అత్యుత్తమ శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. ఈ అకాడమీల నుంచి అధిక సంఖ్యలో క్రికెటర్లు ఐపీఎల్ లో సీఎస్కేకు ఆడేందుకు వస్తే చూడడానికి అద్భుతంగా ఉంటుందని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సే పేర్కొన్నారు

  • Loading...

More Telugu News