Google Play Pass: గూగుల్ ప్లే పాస్ తీసుకుంటే యాడ్స్ లేకుండా యాప్స్, గేమ్స్
- ప్రకటనలు లేని గేమ్స్
- గూగుల్ ప్లే పాస్ కు నెల, వార్షిక ప్లాన్లు
- నెలవారీ ప్లాన్ రూ.99
- వార్షిక ప్లాన్ రూ.889
ఆండ్రాయిడ్ యాప్స్ వాడే వారికి అనుభవమే.. ఎన్నో ప్రకటనలు అడ్డుపడుతూ వినియోగాన్ని అసౌకర్యంగా మార్చేస్తుంటాయి. సీరియస్ గా గేమ్ ఆడుతుంటే మధ్యలో స్క్రీన్ ను పూర్తిగా కప్పేస్తూ ప్రకటన కనిపించడం అనుభవమే. అయితే, ఇలాంటి ప్రకటనల ఇబ్బంది లేకుండా ఉంటే బావుంటుందని కోరుకునే వారి కోసం గూగుల్ ఒక ప్యాకేజీ ప్రకటించింది.
గూగుల్ ప్లే పాస్ తీసుకుంటే ప్రకటనలు లేని 1,000కు పైగా యాప్స్ గేమ్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. భారత్ లో ఆండ్రాయిడ్ పరికరాలపై ప్లే పాస్ ఈ వారంలోనే అందుబాటులోకి వస్తుందని తాజాగా ప్రకటించింది. ప్లే పాస్ అమెరికాలో రెండేళ్ల క్రితం అందుబాటులోకి రావడం గమనార్హం.
యాపిల్ కూడా ప్రకటనలు లేని యాప్స్, గేమ్స్ ను ప్రత్యేక పెయిడ్ సర్వీస్ కింద ఆఫర్ చేస్తుండటం గమనార్హం. ప్రకటనలు లేని యాప్స్, గేమ్స్ ను ఎప్పటికప్పుడు ప్లే పాస్ కిందకు తీసుకువచ్చేందుకు డెవలపర్లతో కలసి పనిచేస్తామని గూగుల్ ప్రకటించింది.
నెలవారీ పాస్ కోసం రూ.99 కట్టాలి. ఏడాదికి అయితే రూ.889. ప్రీ పెయిడ్ రూపంలో అయితే ఒక నెలకు రూ.109. ప్లే పాస్ యూజర్ తన కుటుంబ సభ్యులు ఐదుగురితో దాన్ని పంచుకోవచ్చు.