Ukraine: పుతిన్ దిద్దుబాటు.. బ్యాంకు రేటును డ‌బుల్ చేస్తూ నిర్ణ‌యం

putin doubles russian bank rate

  • బ్యాంకు రేటును డ‌బుల్ చేసిన పుతిన్‌
  • పుతిన్ బాట‌లోనే ర‌ష్యన్ సెంట్ర‌ల్ బ్యాంకు చ‌ర్య‌లు
  • బ్యాంకుల‌కు అధిక నిల్వ‌లు ఇచ్చేందుకు సిద్ధం
  • బ్యాంకుల కార్య‌క‌లాపాల‌పై ఆంక్ష‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసిన వైనం

ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో క‌దులుతున్న ర‌ష్యాపై అమెరికా స‌హా యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు ఆర్థికప‌ర‌మైన అంశాల్లో ఆంక్ష‌లు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతర్జాతీయ బ్యాంక్ పేమెంట్స్ వ్యవస్థ 'స్విఫ్ట్' నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను తొలగిస్తున్నట్టు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ తో అన్ని లావాదేవీలను ఆపేశాయి. దీంతో, రష్యన్ కరెన్సీ విలువ ఘోరంగా పతనమవుతోంది. ఈ క్ర‌మంలో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

క‌రెన్సీ విలువ భారీగా ప‌డిపోతే.. దేశ ఆర్థిక స్థిర‌త్వం దెబ్బ‌తినే ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన పుతిన్ త‌క్ష‌ణ‌మే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. ఇందుకోసం బ్యాంకు రేటును ఒక్కసారిగా డ‌బుల్ చేశారు. ప్ర‌స్తుతం ర‌ష్యాలో బ్యాంకు రేటు 9.5గా ఉంది. దానిని ఏకంగా 20 శాతానికి పెంచుతూ పుతిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రోవైపు పుతిన్ స‌ల‌హాతో ర‌ష్యన్ సెంట్రల్ బ్యాంకు కూడా దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. బ్యాంకుల కార్య‌క‌లాపాల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను స‌రళ‌త‌రం చేయ‌డంతో పాటు బ్యాంకుల‌కు మ‌రింత మేర న‌గ‌దు నిల్వ‌ల‌ను పెంచాల‌ని సెంట్ర‌ల్ బ్యాంకు నిర్ణ‌యించింది.

  • Loading...

More Telugu News