YS Vivekananda Reddy: వివేకా హ‌త్య కేసులో రాష్ట్ర పోలీసుల‌పై ఒత్తిడి లేదు: ఏపీ డీజీపీ

ap dgp rajendranath reddy comments on ys vivekananda reddy murder case

  • వివేకా కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త సీబీఐదే
  • ద‌ర్యాప్తులో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండ‌బోదు
  • ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో రోజుకో కొత్త మ‌లుపు చోటుచేసుకుంటోంది. వివేకా కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు, త‌న సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డిపై విచార‌ణ చేయించాలంటూ లోక్ స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాల‌కు ఆమె రాసిన లేఖ‌ పెను క‌ల‌క‌లమే రేపాయి.

ఈ నేపథ్యంలో.. ఏపీ డీజీపీగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. వివేకా హ‌త్య, ఆ కేసు ద‌ర్యాప్తుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు. ఈ కార‌ణంగా ఈ కేసు ద‌ర్యాప్తులో తామేమీ క‌లుగ‌జేసుకోవ‌డం లేద‌ని కూడా తెలిపారు. అదే స‌మ‌యంలో ఈ కేసు ద‌ర్యాప్తులో రాష్ట్ర పోలీసుల‌పై ఎలాంటి ఒత్తిడిలు కూడా లేవ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News