Ukraine: యుద్ధం ఆగకపోతే శరణార్థుల సంఖ్య 70 లక్షలకు చేరవచ్చు: ఇండియాలో ఉక్రెయిన్ రాయబారి

Though we are victims of Russia we are helping others says Ukraine Ambassador

  • తాము రష్యా దురాక్రమణ బాధితులం
  • అయినా ఇతరులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
  • యుద్ధాన్ని ఆపడమే ఉక్రెయిన్ ప్రాధాన్యతా అంశమన్న రాయబారి 

తాము రష్యా దురాక్రమణ బాధితులమని ఇండియాలో ఉక్రెయిన్ రాయబారి ఐగోర్ పోలిఖా అన్నారు. అయినప్పటికీ ఇతరులకు సాయపడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం చేస్తున్నామని తెలిపారు. 

భారతీయ విద్యార్థుల రక్షణ విషయంలో హామీ ఇవ్వాల్సింది రష్యా మాత్రమేనని చెప్పారు. యుద్ధాన్ని ఆపడం, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ఉక్రెయిన్ ప్రాధాన్యతా అంశమని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థుల సంఖ్య 4 లక్షలకు పైగానే ఉందని... యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య 70 లక్షలను దాటుతుందని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు సరిహద్దులు దాటేందుకు క్యూలలో వేచి చూస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News