Telangana: ఏపీ మాదిరే.. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు

telangana assembly budget sessions will start from march 7
  • మార్చి 7న ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు
  • అదే రోజున తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణ‌యం
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌కు సంబంధించి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ సారి ఒకే తేదీన ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సంబంధించి ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల కాగా.. తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ తేదీపై మాత్రం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది. ఏపీలో మాదిరే తెలంగాణ‌లో కూడా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మార్చి 7న‌నే ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు స‌మావేశాలు మొద‌లు కానున్నట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సీఎం కేసీఆర్ సోమ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అందుబాటులో ఉన్న మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రులు హ‌రీశ్ రావు, ప్ర‌శాంత్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌రైన‌ట్లుగా స‌మాచారం. మార్చి 7న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్రారంభించాల‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.
Telangana
assembly budget sessions
cm kcr
pragathi bhavan

More Telugu News