Spectators: కోహ్లీ 100వ టెస్టు నేపథ్యంలో మొహాలీ మైదానంలో ప్రేక్షకులకు అనుమతి

BCCI said spectators will be allowed to Mohali test
  • మార్చి 4 నుంచి టీమిండియా, శ్రీలంక తొలి టెస్టు
  • కెరీర్ లో అరుదైన మైలురాయి ముంగిట కోహ్లీ
  • ప్రేక్షకులకు అనుమతిపై ప్రకటన చేసిన బీసీసీఐ కార్యదర్శి
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. మొహాలీలో ఈ నెల 4 నుంచి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టెస్టు కోహ్లీ కెరీర్ లో 100వ టెస్టు మ్యాచ్. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొహాలీ మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించాలని తాజాగా నిర్ణయించింది. 

గతంలో కరోనా ప్రభావం వల్ల తొలి టెస్టును ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే, కోహ్లీ ఘనత నేపథ్యంలో తన పాత నిర్ణయాన్ని బీసీసీఐ పునఃసమీక్షించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులను అనుమతించే విషయమై పంజాబ్ క్రికెట్ సంఘంతో చర్చించామని, కోహ్లీ కెరీర్ లో ముఖ్యమైన 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంపై వారు సానుకూలంగా స్పందించారని జై షా వెల్లడించారు.
Spectators
Virat Kohli
100th Test
Mohali
Team India
Sri Lanka
BCCI

More Telugu News