Road Accident: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఏపీ ఎమ్మెల్యే కుమారుడు, మేనల్లుడికి గాయాలు

accident in ap
  • తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదం
  • ఎదురులంక జాతీయ రహదారిపై అదుపుత‌ప్పిన కారు
  • ఎమ్మెల్యే పొన్నాడ స‌తీశ్ మేనల్లుడి ప‌రిస్థితి విష‌మం
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ కుమారుడు, మేనల్లుడు గాయపడ్డారు. ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి పై ఈ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. గ‌త‌ అర్ధరాత్రి కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు అదుపుతప్పడంతో, రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింద‌ని అధికారులు చెబుతున్నారు. 

గాయాల‌పాల‌యిన వారిని పోలీసులు కాకినాడ ఆసుప‌త్రికి తరలించారు. పొన్నాడ‌ స‌తీశ్ కుమారుడికి స్వల్ప గాయాలు కాగా, ఆయ‌న‌ మేనల్లుడికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.
Road Accident
Andhra Pradesh

More Telugu News