India: భారత జట్టు ఐర్లాండ్ పర్యటన ఖరారు.. జూన్ లో రెండు టీ20 మ్యాచ్ లు

India to play 2 T20Is in Ireland in June likely to send second string team
  • జూన్ 26 , 28 తేదీల్లో నిర్వహణ 
  • భారత ప్రధాన ఆటగాళ్లు దూరం
  • యువ ఆటగాళ్లతో ప్రత్యేక జట్టు
  • జులై 1-5 వరకు ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్
భారత క్రికెట్ టీమ్ ఇంగ్లండ్ పర్యటన కంటే ముందు ఐర్లాండ్ కు వెళ్లనుంది. జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20 ఇంటర్నేషనల్ (టీ20ఐ) మ్యాచుల్లో ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది. ఇందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ ను క్రికెట్ ఐర్లాండ్ ఖరారు చేసింది. టీ20ల్లో ప్రపంచంలో భారత జట్టు అగ్ర స్థానంలో ఉండడం తెలిసిందే. రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి జట్టు అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతోంది.

మరోపక్క, టీ20 ప్రపంచకప్ 2022కు ఐర్లాండ్ అర్హత సాధించడం తెలిసిందే. దీంతో ఈ ఏడాది చివర్లో ప్రపంచ కప్ కంటే ముందు ఐర్లాండ్ జట్టు.. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా,  అఫ్గానిస్థాన్ జట్లతో టీ20 సిరీస్ లలో పాల్గొననుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండేది సందేహమే. 

ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ -  భారత్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మిగిలిపోయిన ఒక టెస్ట్ మ్యాచ్ జూలై 1-5 మధ్య ఇంగ్లండ్ లో జరగనుంది. గతేడాది మాంచెస్టర్ లో జరగాల్సిన చివరి మ్యాచ్ ను సస్పెండ్ చేశారు. భారత ఆటగాళ్లు కోవిడ్ బారిన పడడమే కారణం. ఈ మ్యాచ్ కు ప్రధాన ఆటగాళ్లు ఉండేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో ఐర్లాండ్ కు పంపించే జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ మందికి చోటు దక్కనుంది.
India
cricket team
t20i
irland
series

More Telugu News