Prahlad Joshi: విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న 90 శాతం మంది ఇండియాలో క్వాలిఫయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు: కేంద్ర మంత్రి

90 percent Studying Medicine Abroad Fail To Clear Qualifiers In India says Prahlad Joshi

  • ఇండయాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ కావాలి
  • ఈ పరీక్షను గట్టెక్కలేకపోతున్న విదేశాల్లో చదివిన విద్యార్థులు
  • ఇక్కడ సీటు రాకపోవడం వల్లే విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు

భారత్ కు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ చేయడానికి పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది ఇండియాలో నిర్వహించే క్వాలిఫయింగ్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించలేకపోతున్నారని చెప్పారు. 

మరోవైపు... విదేశాల్లో మెడిసిన్ చదివేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నకు బదులుగా... ఈ విషయంపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే వారు ఇండియాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ నిర్వహించే 'ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్' పరీక్షను రాయాల్సి ఉంటుంది.

ఇంకోవైపు ఈ అంశంపై కొందరు చెపుతున్న వివరాల ప్రకారం... ఇండియాలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోలేని వారు ఉక్రెయిన్ వంటి దేశాలకు మెడిసిన్ చేయడానికి వెళ్తున్నారు. ఉక్రెయిన్ లో వందలాది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వైద్య విద్యను అభ్యసిస్తున్న కర్ణాటక విద్యార్థి నవీన్ ఖార్ఖివ్ లో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో మరణించాడు.

  • Loading...

More Telugu News