Amaravati: అమరావతికి కేంద్ర బడ్జెట్ లో నిధులు... హర్షం వ్యక్తం చేసిన సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna opines on Centre decision to allocate funds for Amaravathi

  • ప్రొవిజన్ తీసుకువచ్చిన కేంద్రం
  • అమరావతిలో సచివాలయ నిర్మాణానికి నిధులు
  • ఉద్యోగుల గృహ నిర్మాణానికి నిధులు
  • ఇకనైనా రాజధాని వివాదానికి తెరదించాలన్న రామకృష్ణ

ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. అమరావతిలో సచివాలయ నిర్మాణానికి, ఉద్యోగుల గృహాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. సచివాలయ నిర్మాణం కోసం రూ.,1,214 కోట్లు, ఉద్యోగుల గృహాల కోసం రూ.1,126 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రొవిజన్ తీసుకువచ్చింది. దీనిపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. 

కేంద్రం అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ బడ్జెట్ లో నిధులు ఏర్పాటు చేసిందని తెలిపారు. అమరావతికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇకనైనా రాజధాని వివాదానికి తెరదించాలని సీపీఐ రామకృష్ణ హితవు పలికారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన పట్టుదల వీడాలని, రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News