farmers: ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టుకు సాష్టాంగ నమస్కారం చేసిన రైతులు
- అమరావతి రాజధాని కోసం పోరాడుతోన్న రైతులు
- హైకోర్టు తీర్పు పట్ల హర్షం
- వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద సంబరాలు
- ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపితమైందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని కోసం పోరాడుతోన్న రైతులు హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద వారు టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.
మరోవైపు హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. కోర్టు తీర్పు ద్వారా ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపితమైందని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి రైతులపై పగబట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పోరాడతామని స్పష్టం చేశారు.