Sergie Lavrov: అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నది వారే... పాశ్చాత్య దేశాలపై రష్యా విదేశాంగ మంత్రి ఆగ్రహం

Russian foreign minister Sergie Lavrov fires on western countries

  • ఉక్రెయిన్ పై రష్యా వరుస దాడులు
  • యూరప్ లో అణుయుద్ధ భయాలు
  • రష్యా న్యూక్లియర్ వ్యవస్థలను అప్రమత్తం చేసిన పుతిన్
  • మండిపడిన పాశ్చాత్య దేశాలు
  • దీటుగా బదులిచ్చిన సెర్గీ లావ్రోవ్

ఉక్రెయిన్ పై దండయాత్ర నేపథ్యంలో, రష్యా అణ్వస్త్ర విభాగాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నద్ధం చేయడం ఈయూ, నాటో దేశాలను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో పాశ్చాత్య దేశాలు కూడా అణుయుద్ధం, పర్యవసానాల గురించి మాట్లాడుతూ రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ఈ నేథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందిస్తూ... అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నది పాశ్చాత్య దేశాల ప్రభుత్వాధినేతలే అని మండిపడ్డారు. అణుయుద్ధం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నది వారేనని ఆరోపించారు. ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది అణుయుద్ధమే అవుతుందన్నది ఇప్పుడు స్పష్టమైందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. పాశ్చాత్యదేశాల రాజకీయ నేతల బుర్రలోనే అణుయుద్ధం ఆలోచన కదలాడుతోందని పేర్కొన్నారు. రష్యన్లకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. తమను రెచ్చగొట్టి ముగ్గులో దించే ఎలాంటి కవ్వింపులను తాము ఉపేక్షించబోమని ఉద్ఘాటించారు. 

అంతేకాదు, అగ్రరాజ్యం అమెరికాను ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టేతోనూ, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ తోనూ పోల్చారు. "తమ హయాంలో నెపోలియన్, హిట్లర్ ఇద్దరూ కూడా యూరప్ ను లొంగదీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే పనిచేస్తోంది" అని లావ్రోవ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News