Prakash Raj: గుజరాతీ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీపడిన ప్రకాశ్ రాజ్!

 Prakash Raj taken the rights of Dear Father movie

  • తెలుగు తెరపై రీమేకుల సందడి 
  • కొనసాగుతున్న మలయాళ కథల హవా 
  • గుజరాతీ కథపై దృష్టి పెట్టిన ప్రకాశ్ రాజ్ 
  • 'డియర్ ఫాదర్' రీమేక్ హక్కులు సొంతం

తెలుగులో ఇప్పుడు రీమేకుల జోరు నడుస్తోంది. తమిళ .. మలయాళ సినిమాలను ఇక్కడ వరుసగా రీమేకులు చేస్తూ వెళుతున్నారు. ఆ కథలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రతన్ జైన్ నిర్మించిన ఒక గుజరాతీ సినిమా రీమేక్ హక్కులను ప్రకాశ్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఉమాంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన గుజరాతీ సినిమా 'డియర్ ఫాదర్' ఈ రోజునే భారీ స్థాయిలో విడుదలైంది. పరేష్ రావెల్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. 40 ఏళ్ల తరువాత ఆయన చేసిన గుజరాతీ సినిమా కావడంతో అక్కడ అందరిలో ఆసక్తి నెలకొంది. వయసుమళ్లిన ఒక వ్యక్తి .. అతని కొడుకు .. కోడలు మధ్య నడిచే కథ ఇది. 

కథానాయకుడికి యాక్సిడెంట్ కావడంతో పోలీస్ విచారణ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా కథానాయకుడి మాదిరిగానే ఉండటంతో కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఈ కథ గురించి తెలియగానే ప్రకాశ్ రాజ్ పోటీపడి ఈ సినిమా దక్షిణాది రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. నిజంగానే ఈ పాత్రకి ప్రకాశ్ రాజ్ బాగా సెట్ అవుతాడు కూడా.

  • Loading...

More Telugu News