Russia: ఊపిరి పీల్చుకున్న ఐరోపా.. ఉక్రెయిన్ అణు కేంద్రానికి తప్పిన పెను ముప్పు
- అణువిద్యుత్ కేంద్రంలో మంటలు
- అందులోకి అగ్నిమాపక సిబ్బందిని అనుమతించిన దళాలు
- మంటలు అర్పేసిన సిబ్బంది
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోన్న క్రమంలో ఎనర్హోదర్ నగరంలోని ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజ్జియా కేంద్రంపై కూడా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఆ అణువిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దానిపై దాడులు ఇలాగే కొనసాగితే పెను విధ్వంసం తప్పదని నిఫుణులు కూడా హెచ్చరించారు. అయితే, ఆ ప్రాంతానికి ఆర్మీ దళాలు సహాయక సిబ్బంది, అగ్ని మాపక కేంద్రాలను అనుమతించడంతో పెను ప్రమాదం తప్పింది.
మంటలు చెలరేగుతోన్న ప్రాంతానికి వెంటనే చేరుకున్న జాతీయ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసినట్లు అధికారులు ప్రకటన చేశారు. అణు విద్యుత్ కేంద్రం వద్ద మరిన్ని దాడులు జరగడం లేదని, ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు తెలిపారు. దీంతో ఐరోపా ఊపిరి పీల్చుకుంది. ఈ మంటలు ఇలాగే కొనసాగితే ఐరోపాపై తీవ్ర ప్రభావం పడేది.