Hero MotoCorp: హీరో మోటో నుంచి తొలి ‘విదా’ ఎలక్ట్రిక్ టూ వీలర్.. చిత్తూరు ప్లాంట్ లో తయారీ
- విదా బ్రాండ్ ఆవిష్కరణ
- ఈ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
- ప్రకటించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్
హీరో గ్లామర్, స్పెండర్, పాషన్ పేరుతో దేశ ప్రజలు అందరికీ పరిచయమైన హీరో మోటోకార్ప్.. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి విదా బ్రాండ్ ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ కింద తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని జూలై 1న విడుదల చేయనుంది. దీనిని చిత్తూరు ప్లాంట్ లో తయారు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.